డైరెక్ట్ ఓటిటి గా కృష్ణ వంశీ “రంగమార్తాండ”?

Published on Sep 21, 2021 11:29 pm IST


క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగమార్తాండ. మరాఠీ లో సూపర్ హిట్ సాధించిన ఒక చిత్రం ను రంగమార్తాండ గా తీసుకు వస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఇంకా పూర్తి కావల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న కొన్ని కారణాల వలన చిత్రం షూటింగ్ నిలిపి వేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం ను దర్శకుడు కృష్ణవంశీ డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సైతం చేయడం జరిగింది. అయితే తాజాగా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని డైరక్ట్ ఓటిటి గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త పై ఎలాంటి నిర్దారణ లేనప్పటికీ, ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. దీని పై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన ఇస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :