పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న హార్రర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మారుతి అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు.
ఇక ఈ సినిమా నుంచి తాజాగా వినిపిస్తున్న వార్తలు అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చడం ఖాయంగా కనిపిస్తోంది. రాజా సాబ్ చిత్ర టీజర్‌ను మే నెలలో ఎలాగైనా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న ప్రభాస్ ఇప్పట్లో ఇండియాకు వచ్చేలా కనిపించడం లేదని తెలుస్తోంది.
దీంతో ‘రాజా సాబ్’పై క్రియేట్ కావాల్సిన బజ్ ఎలాగైనా వస్తుందని ప్రభాస్ భావిస్తున్నాడట. మరి ఈ విషయంపై ప్రభాస్ ఏమైనా స్పిందిస్తాడేమో చూడాలి.