సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మజిలీ. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుండి ‘నా గుండెల్లో’ సాంగ్ మేకింగ్ వీడియో రేపు ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ద్వారా తెలిపింది.
ఇక ఈ చిత్రం మిడిల్ క్లాస్ స్టోరీ అని.. మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తున్నట్టు సినిమా ఉంటుందని.. ఖఛ్చితంగా రెండున్నర గంటల సేపు ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళే సినిమా మజిలీ’ అని చెబుతుంది చిత్రబృందం. గోపి సుందర్ మరియు తమన్ కలిసి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

