ఆగస్ట్ 31 కి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి “తుగ్లక్ దర్బార్” ట్రైలర్ విడుదల!

Published on Aug 27, 2021 1:13 pm IST


మక్కల్ సెల్వన్ హీరోగా ఢిల్లీ ప్రసాద్ దీనదయాల్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం తుగ్లక్ దర్బార్. ఈ చిత్రం లో రాశి ఖన్నా, గాయత్రి, మంజిమ మోహన్, అదితి రావు హైదరి, రార్తిపన్, భగవతి పెరుమాళ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటి గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల చేయనున్నారు మేకర్స్.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కి సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. ఆగస్ట్ 31 వ తేదీన ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయం సైతం ట్రైలర్ తో ఒక క్లారిటీ రానుంది. ట్రైలర్ తో ఈ చిత్రం ఎలా ఉండనుంది అనే దాని పై సైతం ఒక క్లారిటీ వచ్చే అవకాశం వుంది. ఎస్. ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :