రవితేజ తో రెండవ సారి జతకట్టనున్న యువ కథానాయిక ?
Published on Jun 26, 2018 12:36 am IST

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వం లో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటిస్తున్నాడు . శరవేగంగా చిత్రకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వెంకీ , దుబాయ్ శీను చిత్రాల మాదిరిగానే ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిస్తున్నారట .

ఇక ఈసినిమా తరువాత రవితేజ మరో రెండు చిత్రాలలో నటించనున్నాడు అందులో ఒక సినిమాని ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫెమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో చేయనున్నాడు . రవితేజ రెండు పాత్రల్లో నటించనున్న ఈ చిత్రంలో మాళవిక శర్మ కథనాయికగా నటించనుందని సమాచారం. ఇటీవల వీరిద్దరూ కలిసి నేల టిక్కెట్టు చిత్రం తో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook