ఆకట్టుకుంటున్న ‘ ఏజెంట్ ‘ నుండి ‘ మళ్లీ మళ్ళీ ‘ సాంగ్

agent 4

అఖిల్ అక్కినేని హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ సంస్థల పై అనిల్ సుంకర ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ టీజర్స్ మరింతగా ఆకట్టుకుని అంచనాలు విపరీతంగా పెంచేశాయి.

ఇక నేడు ఈ మూవీ నుండి యూత్ఫుల్ ట్రెండీ మెలోడియస్ సాంగ్ మళ్ళీ మళ్ళీ ని యూట్యూబ్ లో కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు మేకర్స్. నేడు ట్విట్టర్ స్పేస్ కండక్ట్ చేసిన ఏజెంట్ యూనిట్ అభిమానుల చేత ఈ సాంగ్ ని రిలీజ్ చేయించారు. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించడం తో పాటు స్వయంగా పాడిన ఈ సాంగ్ ప్రస్తుతం యూత్ ను ఎంతో ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. కాగా ఏజెంట్ మూవీ ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28 న పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version