సమీక్ష : “మళ్ళీ పెళ్లి” – అక్కడక్కడా మెప్పించే బోల్డ్ కపుల్ డ్రామా

సమీక్ష : “మళ్ళీ పెళ్లి” – అక్కడక్కడా మెప్పించే బోల్డ్ కపుల్ డ్రామా

Published on May 27, 2023 3:03 AM IST
Malli Pelli Movie Review In Telugu

విడుదల తేదీ : మే 26, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: నరేష్, పవిత్ర లోకేష్, జయసుధ, శరత్ బాబు. వనితా విజయకుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణమ్మ

దర్శకులు : ఎం ఎస్ రాజు

నిర్మాతలు: నరేష్

సంగీత దర్శకులు: సురేష్ బొబ్బిలి మరియు అరుల్‌దేవ్

సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి

ఎడిటర్: జునైద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

రీసెంట్ గా సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా మారిన సీనియర్ కపుల్ నటుడు నరేష్ మరియు పవిత్రలు.. తాము కలిసి నటించిన లేటెస్ట్ సినిమా “మళ్ళీ పెళ్లి” తో అయితే ఇప్పుడు ఆడియెన్ ముందుకు వచ్చారు. మరి దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఈ చిత్రం బోల్డ్ ప్రమోషనల్ కంటెంట్ తో అయితే ఇప్పుడు థియేటర్స్ వరకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వచ్చినట్టు అయితే..నరేంద్ర(నరేష్) ఓ పేరుమోసిన టాలీవుడ్ స్టార్ నటుడు కాగా తాను తన స్టార్డం తో ఎంతో సంపాదిస్తాడు కానీ తన లైఫ్ లో మాత్రం ఎక్కడో తీరని అశాంతి ఉంటుంది. ఇక ఇదే క్రమంలో సౌమ్య సేతుపతి(వనితా విజయ్ కుమార్) ని పెళ్లి చేసుకోగా తన వైవాహిక బంధంలో కూడా మనశ్శాంతి లభించదు. కానీ సమయంలో కన్నడ నటి పార్వతి(పవిత్ర లోకేష్) ని సెట్స్ లో మీట్ అయ్యిన తాను నెమ్మదిగా ఆమెను ఇష్టపడం స్టార్ట్ చేస్తాడు. ఇదే క్రమంలో ఆమె కూడా నరేంద్ర పై ఇష్టాన్ని ఏర్పర్చుకుంటుంది. అయితే ఇక్కడ నుంచి వీరి లైఫ్ ఎలా టర్న్ అయ్యింది. వీరి ప్రేమ పెళ్లి వరకూ వెళితే ఎలా వెళ్ళింది? ఈ సమయంలో ఈ జంటకి ఎదురయిన సవాళ్లు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మేజర్ ప్లస్ పాయింట్స్ లో మొదటగా టాలీవుడ్ సినిమా దగ్గర అపారమైన అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ టర్న్డ్ డైరెక్టర్ ఎం ఎస్ రాజు కోసం చెప్పుకోవాలి. తాను డైరెక్టర్ గా మారిన తర్వాత ఆల్ మోస్ట్ అన్నీ బోల్డ్ ఎంటర్టైనర్స్ నే టేకప్ చేయగా ఇంట్రెస్టింగ్ వాటిని ఆల్ మోస్ట్ ఆకట్టుకునేలానే తెరకెక్కించడం విశేషం. ఇదే తరహాలో ఇప్పుడు ఈ సినిమాని కూడా వారు హ్యాండిల్ చేశారు అని చెప్పొచ్చు. కథాంశాన్ని పలు దశల్లో ప్రెజెంట్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది.

మెయిన్ గా “మిస్టేక్” చాప్టర్ ని అయితే బాగా హ్యాండిల్ చేసారు. ఇక వీటితో పాటుగా మెయిన్ కెమిస్ట్రీ వారు ఎలా ప్రేమలో పడ్డారు అనే కొన్ని అంశాలు కన్వీనెంట్ గానే అనిపిస్తాయి. ఇక మరో మేజర్ ఎసెట్ ఏమిటంటే సినిమాలో క్యాస్టింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉండగా వాటిలో పలు బలమైన పాత్రలకు ఆయా సీనియర్ నటుల్ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసారు. నటి జయ సుధా, నటుడు శరత్ కుమార్ లాంటి నటుడు కీలక పాత్రల్లో నటించి సినిమాలో కీలకంగా మారారు.

అలాగే మెయిన్ లీడ్ గా కనిపించిన నరేష్, పవిత్ర లోకేష్ లు మధ్య ఏపాటి కెమిస్ట్రీ ఉందో ఇది వరకే చూపించారు. ఇక సినిమాలో వాటితో పాటుగా వారి పెయిన్, ఇతర ఎమోషన్స్ కూడా బావున్నాయి. కొన్ని సన్నివేశాల్లో పవిత్ర లోకేష్ అయితే సెటిల్డ్ పెర్ఫామెన్స్ ని కనబరిచారు. ఇక నరేష్ అయితే ఎప్పటిలానే తన ఈజ్ నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఫైనల్ గా ఈ సినిమాలో మరో మేజర్ ప్లస్ నటి వనితా విజయ్ కుమార్ అని చెప్పొచ్చు. ఆమె తనదైన స్టెల్లార్ పెర్ఫామెన్స్ తో అయితే సినిమాలో ఆకట్టుకున్నారు. ఆమెపై సీన్స్ కాయాన్ని పలు అగ్రెసివ్ సీన్స్ లో నటనగా చాలా ఇంప్రెసివ్ గా అయితే అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమా విషయంలో మొదటి నుంచి కూడా కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంది. చాలా మందికి ట్రైలర్ టీజర్ లు చూసాక ఇది నరేష్ పవిత్ర లోకేష్ ల రియల్ లైఫ్ లో జరిగిన కథనే సినిమాగా తీశారు అని అనుకున్నారు. కానీ ఇదే అంశాలతో మరికొన్ని పాయింట్స్ జోడించడంతో సినిమాలో ఆ కన్ఫ్యూజన్ కాస్తా ఆ కొంతమందికి కొనసాగవచ్చు.

దీనితో సినిమాలో ఏ సన్నివేశాలు వరకు నిజం ఉంది ఏ సన్నివేశాలు వరకు లేదు అనే పాయింట్ మాత్రం అర్ధం కాకపోవచ్చు. ఇక మరో పాయింట్ ఏమిటంటే ఈ సినిమా నరేషన్ అని చెప్పాలి. చాలా వరుసకు సినిమా కాస్త స్లో గా సాగదీతగానే ఉన్నట్టు అనిపిస్తుంది. దీనితో అక్కడక్కడా ఫ్లో మిస్ అవుతుంది.

అలాగే పవిత్ర లోకేష్ పై ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఏమంత మెప్పించవు పైగా బోర్ కొట్టిస్తాయి. ఈ సినిమా కేవలం 2 గంటల 10 నిమిషాలే అయినప్పటికీ ఆ స్లో నరేషన్ మూలాన పెద్ద సినిమా చూసిన అనుభూతి కలుగక మానదు. పైగా ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పిస్తుందా అంటే అది కష్టమే అని కూడా చెప్పవచ్చు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఇక టెక్నికల్ టీం లో అయితే సురేష్ బొబ్బిలి, అరుళ్ దేవ్ ల మ్యూజిక్ బాగుంది. బాలిరెడ్డి సినిమాటోగ్రఫీ కూడా క్లీన్ గా మంచి విజువల్స్ తో ఉంది. ఇక జునైద్ ఎడిటింగ్ బాగాలేదు. చాలావరకు అనవసర, ల్యాగ్ ఉన్న సీన్స్ ని కట్ చేయాల్సింది.

ఇక దర్శకుడు ఎం రాజు విషయానికి వస్తే ముందు చెప్పినట్టుగానే తాను ఈ చిత్రాన్ని తన ఎక్స్ పీరియన్స్ తో సాలిడ్ గా హ్యాండిల్ చేశారు. క్యాస్టింగ్ గాని తమ మ్యూజిక్ అభిరుచి గని బాగా కనిపిస్తాయి. కాకపోతే మరికొన్ని డీటెయిల్స్ గాని నరేషన్ ని ఇంకాస్త ఎంగేజింగ్ గా కొన్ని అనవసర సీన్స్ పెట్టకుండా ఉండి ఉంటే మరింత మంచి అవుట్ పుట్ వచ్చి ఉండేది. అది మినహా తన వర్క్ ఇంప్రెస్ చేస్తుంది.

 

తీర్పు :

 

ఇక ఫైనల్ గా చూసినట్టు అయితే పలు కాంట్రవర్సీలతో మంచి బజ్ తో వచ్చిన ఈ “మళ్ళీ పెళ్లి” కొన్ని వర్గాలు ఆడియెన్స్ ని పర్టిక్యులర్ గా ఈ సినిమా కోసం ఎదురు చూసిన ఆడియెన్స్ ని అయితే ఆకట్టుకోవచ్చు. ఎం ఎస్ రాజు డైరెక్షన్, మెయిన్ లీడ్ నరేష్ పవిత్ర లోకేష్ లు బోల్డ్ కపుల్ గా ఇంప్రెస్ చేయగా వనితా విజయ్ కుమార్ ఇతర ముఖ్య నటుల నటనలు బాగున్నాయి. కాకపోతే సినిమాలో స్లో నరేషన్ మాత్రం బాగా సాగదీతగా అనిపిస్తుంది. దీనితో ఈ స్లో డ్రామా కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు