‘మన్మథుడు 2’ ఔట్ ఫుట్ చాలా బాగుందట !

Published on Jun 2, 2019 3:00 pm IST

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘మన్మథుడు 2’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన కథానాయిక. ‘చిలసౌ’ చిత్రంతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పటికే షూట్ 90 శాతం పూర్తికాగా వచ్చిన ఔట్ ఫుట్ పట్ల చిత్ర యూనిట్ చాలా సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

అధిక భాగం పోర్చుగల్ దేశంలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో సమంత అక్కినేని సైతం ఒక కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2002లో విజయ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘మన్మథుడు’కు సీక్వెల్ కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :

More