ధనుష్ సినిమాలోకి మెగాస్టార్ ఎంట్రీ.. హైప్ పెంచుతున్న కాంబినేషన్..!

D55

తమిళ హీరో ధనుష్ తన కెరీర్‌లోని 55వ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుందని మేకర్స్ రివీల్ చేశారు. దీంతో ఈ సినిమాలో ధనుష్-సాయి పల్లవి జోడి ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

దీంతో ధనుష్ చిత్రంలో మమ్ముట్టి ఎలాంటి పాత్రలో అదరగొడతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మమ్ముట్టి రాకతో ఈ సినిమాపై అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ సినిమాతో ధనుష్-మమ్ముట్టి కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.

Exit mobile version