తమిళ హీరోలు విశాల్, ఆర్యలు కలిసి ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకు ‘ఎనిమీ’ అనే టైటిల్ నిర్ణయించారు. గతంలో ఆర్య, విశాల్ కలిసి బాల దర్శకత్వంలో చేసిన ‘అవన్ ఇవన్’ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ‘ఎనిమీ’ మీద తమిళ సినీ జనంలో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రంలో విశాల్ జోడీగా మృణాళిని రవి నటిస్తుండగా ఆర్యకు జోడీగా మమతా మోహన్ దాస్ నటించనుంది.
మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన మమతా మోహన్ దాస్ తమిళం, తెలుగు భాషల్లో కూడ చేసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఈ రెండు ఇండస్ట్రీలకు బై బై చెప్పేసి మళయాళంలోనే స్థిరపడిపోయింది. ఇన్నాళ్లు అక్కడే సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ జోడా తెచ్చుకున్న ఆమె మళ్ళీ తమిళ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇస్తోంది. చివరగా 2006లో విశాల్ హీరోగా రూపొందిన ‘శివపత్తిగారం’ సినిమాలో హీరోయిన్ రోల్ చేసిన ఆమె పదకొండేళ్ల తర్వాత మళ్ళీ తమిళంలో లీడ్ హీరోయిన్ రోల్ చేస్తోంది. ఇది మాత్రమే కాకుండా తమిళంలో ఇంకొక సినిమాకు కూడ్ సైన్ చేసింది ఈ మలయాళ బ్యూటీ.


