సేతుపతి కుమార్తెను బెదిరించిన నెటిజన్ ఇపుడు క్షమాపణలు చెప్తున్నాడు

Published on Oct 28, 2020 12:37 am IST


విజయ్ సేతుపతి శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’లో నటిస్తున్నాడని అధికారికంగా కన్ఫర్మ్ కావడం, మోషన్ పోస్టర్ బయటకు రావడంతో పెద్ద దుమారం రేగింది. సేతుపతి ఆ సినిమాలో నటించడానికి తాము ఒప్పుకోమని, ప్రభాకరన్ ఉద్యమానికి మద్దతివ్వని మురళీధరన్ యొక్క బయోపిక్ చేస్తే తమిళ జాతికి ద్రోహం చేసినట్టేనని విరుచుకుపడ్డారు. అనేక రకాలుగా ఆయనపై వ్యతిరేకత చూపారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ మరీ హద్దులు దాటాడు.

సేతుపతి కుమార్తె మీద దాడి చేస్తాను అంటూ అసభ్యకరమైన కామెంట్ చేశాడు. అది చూశాక అప్పటివరకు సేతుపతి మీద విమర్శలు చేసిన వాళ్ళు సైతం సదరు నెటిజన్ ను తిట్టిపోశారు. అతని మీద కేసు కూడ నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. వేలమంది సేతుపతి మద్దతిగా నిలిచారు. దీంతో తప్పుచేసిన ఆ నెటిజన్ తన తప్పును తెలుసుకున్నాడు. వెంటనే సెల్ఫీ వీడియో ద్వారా సేతుపతికి బహిరంగ క్షమాపణలు చెప్పాడు.

‘విజయ్ సేతుపతిగారు, ఆయన కూతురి గురించి అసభ్యకర కామెంట్ చేసింది నేనే. నా తప్పు పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. నేను చేసింది చిన్న తప్పు కాదని తెలుసు. కానీ కరోనా కారణంగా నా జాబ్ పోయింది. ఆ ఒత్తిడితోనే అలాంటి కామెంట్ చేశాను. నేను శిక్షార్హుడినే. సేతుపతిగారి కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నా. మీ సోదరుడిలా భావించి నన్ను క్షమించండి సార్’ అంటూ తన పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చాడు.

సంబంధిత సమాచారం :

More