మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం ‘మనశంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కంటిన్యూ చేస్తుంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా మెగాస్టార్ తనదైన పర్ఫార్మెన్స్‌తో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రం తాజాగా వరల్డ్‌వైడ్‌గా రూ.200 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మెగా రెస్పాన్స్ అందించిన అభిమానులకు, సాలిడ్ కలెక్షన్స్ అందిస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ ఓ కీలక కామియో రోల్‌లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేశారు.


