డబుల్ సెంచరీ బాదేసిన మన శంకర వరప్రసాద్ గారు.. బాస్ క్రేజ్ మామూలుగా లేదుగా..!

Mana Shankara Varaprasad Garu

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం ‘మనశంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కంటిన్యూ చేస్తుంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా మెగాస్టార్ తనదైన పర్ఫార్మెన్స్‌తో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రం తాజాగా వరల్డ్‌వైడ్‌గా రూ.200 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మెగా రెస్పాన్స్ అందించిన అభిమానులకు, సాలిడ్ కలెక్షన్స్ అందిస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ ఓ కీలక కామియో రోల్‌లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version