నార్త్ అమెరికాలో బాస్ దూకుడు.. ఏకంగా 2.5 మిలియన్ మార్క్ క్రాస్..!

నార్త్ అమెరికాలో బాస్ దూకుడు.. ఏకంగా 2.5 మిలియన్ మార్క్ క్రాస్..!

Published on Jan 17, 2026 8:08 PM IST

Mana shankara vara prasad garu

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ సంక్రాంతి రేసులో దూసుకుపోతుంది.

ఇక ఈ చిత్రానికి అమెరికాలో అభిమానులు పట్టం కడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా 2.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది. త్వరలోనే ఈ చిత్రం 3 మిలియన్ మార్క్‌ను టచ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి తనదైన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో నటించిన ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన మార్క్ టేకింగ్‌తో ఇరగదీశాడు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ క్యామియో అదిరిపోయింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు