నైజాంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ రేర్ రికార్డు.. ఎంతమంది చూశారంటే..?

నైజాంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ రేర్ రికార్డు.. ఎంతమంది చూశారంటే..?

Published on Jan 30, 2026 8:02 PM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సునామీని మరోసారి నిరూపించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరాప్రసాద్ గారు’ టాలీవుడ్‌లో సరికొత్త రీజినల్ ‘ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. ఈ ఏడాది సంక్రాంతి రేసులో భారీ పోటీ ఉన్నప్పటికీ, అందరినీ వెనక్కి నెట్టి ఈ చిత్రం బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది సరికొత్త రికార్డులను సృష్టించడం విశేషం.

ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఓటీటీ కాలంలో థియేటర్లకు జనం రావడం తగ్గుతున్న తరుణంలో, కేవలం తెలంగాణలోనే 30 లక్షల మందికి పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా కలెక్షన్ల లెక్కలే చెప్పే ఈ రోజుల్లో, ప్రొడక్షన్ హౌస్ ఇలా ‘ఫుట్‌ఫాల్స్’ వివరాలను వెల్లడించడం పట్ల సినీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. మెగాస్టార్ మ్యానరిజమ్స్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఈ రేంజ్ సక్సెస్‌కు ప్రధాన కారణమయ్యాయి.

షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో మెరిసి అభిమానులను అలరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు