ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” కూడా ఒకటి. మంచి అంచనాలు నడుమ వచ్చి సెన్సేషనల్ హిట్ గా ఈ సినిమా నిలిచి రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇలా థియేటర్స్ లో సుమారు 400 కోట్ల దగ్గర వసూళ్లు ఈ సినిమా సొంతం చేసుకోగా ఆ తర్వాత ఓటిటిలో కూడా రికార్డు రెస్పాన్స్ ఈ చిత్రం సొంతం చేసుకొని అదరగొట్టింది. ఇక వాటి తర్వాత ఇటీవలే బుల్లితెరపై కూడా టెలికాస్ట్ కి రాగా మెగాస్టార్ అక్కడ కూడా రఫ్ఫాడించారు. ఈ సినిమా జీ తెలుగులో మొదటి టెలికాస్ట్ కి గాను 14.2 టీఆర్పీ రేటింగ్ నమోదు అయ్యింది.
ఈ మధ్య కాలంలో ఓ స్టార్ కాంబినేషన్ సినిమాకి ఇది భారీ మొత్తమే అని చెప్పాలి. సో ఇలా అక్కడ ఇక్కడ అని లేకుండా అన్ని ప్లాట్ ఫామ్ లలో కూడా ఈ సినిమా హిట్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో వెంకీ మామ గెస్ట్ రోల్ చేయగా భీమ్స్ సంగీతం అందించారు. అలాగే సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణం వహించారు.
