‘మనం’ ఆడియో రిలీజ్ డేట్

‘మనం’ ఆడియో రిలీజ్ డేట్

Published on May 7, 2014 6:25 PM IST

Manam
ప్రస్తుతం సినీ అభిమానులు, ఇండస్ట్రీ ఎంతగానో ఎదురు చూస్తున్న అక్కినేని వారి మల్టీ స్టారర్ సినిమా ‘మనం’. ఎలాంటి ఆడియో ఫంక్షన్ చేయకుండా మే 9న డైరెక్ట్ గా ఈ మూవీ ఆడియోని మార్కెట్లోకి రిలీజ్ యనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు కి గౌరవం ఇచ్చి ఈ సినిమాకి ఆడియో ఫంక్షన్ చేయకూడదని ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది.

అనూబ్ రూబెన్స్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ఎఎన్ఆర్ తో పాటు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని ఫ్యామిలీ నిర్మించిన ఈ సినిమాకి విక్రమ్ కుమార్ డైరెక్టర్. అమితాబ్ బచ్చన్ అతిధి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి హర్షవర్ధన్ డైలాగ్స్ అందించాడు.

తాజా వార్తలు