హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న మనం

Published on Nov 9, 2013 10:00 pm IST

Manam
వచ్చే యేడాది విడుదలకానున్న సినిమాలలో పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘మనం’ సినిమా ఒకటి. ఈ సినిమాలో అక్కినేని వంశంలో మూడు తరాల నటులు కలిపి నటించడం విశేషం.

నాగేశ్వరరావు గారి జన్మదిన కానుక సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి లుక్ పోస్టర్ కు అనూహ్యమైన స్పందన రావడమేకాక ఈ ఐడియాకు ప్రశంసలను కూడా చిత్రబృందం అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో నాగచైతన్య మరియు సమంతల మధ్య సన్నివేశాలను తీస్తున్నారు. ఇది నాగచైతన్య మరియు సమంత కలిపి నటిస్తున్న మూడో సినిమా.

నాగార్జున సరసన శ్రేయ నటిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. విక్రమ్ కుమార్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :