ఆహా వీడియో లోకి వచ్చేసిన “మంచి రోజులు వచ్చాయి”

Published on Dec 3, 2021 6:29 pm IST


సంతోష్ శోభన్, మెహ్రిన్ హీరో హీరోయిన్ లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం మంచి రోజులు వచ్చాయి. నవంబర్ 4 వ తేదీన థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. యూ వీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ లపై ఈ చిత్రాన్ని వీ సెల్యులాయిడ్ మరియు ఎస్కేఎన్ లు సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఆహా వీడియో లోకి వచ్చేసింది. థియేటర్ల లో విశేషం గా ఆకట్టుకున్న ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా వచ్చి అభిమానులను ఏ విధంగా ఎంటర్ టైన్ చేస్తుందొ చూడాలి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ ను సైతం ఆకట్టుకుంటుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం లో అజయ్ ఘోష్ కీలక పాత్రలో నటించారు. ఉద్భవ్ ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరించగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి అందించారు.

సంబంధిత సమాచారం :