బాలు గారి ఆరోగ్యం విషయంపై మంచు లక్ష్మి ఎమోషనల్ ట్వీట్.!

Published on Sep 25, 2020 8:18 am IST

గత కొన్ని వారల కితం నుంచి మన దేశపు లెజెండరీ సింగర్ ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆగష్టు నుంచి ఇప్పటి వరకు అనేక మార్లు ఆయన ఆరోగ్యం అటు ఇటుగా మారుతూ వస్తుంది. దీనితో అభిమానులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆయన తనయుడు చరణ్ అందిస్తూ వస్తున్నారు.

అయితే గత కొన్ని రోజుల కితమే ఆయన ఆరోగ్యం కుదుట పడింది అని వచ్చిన వార్త కాస్త ఉపశమనం కలిగించింది కానీ తాజాగా మళ్ళీ ఆయన ఆరోగ్యం క్షీణించిందని వచ్చిన వార్త ప్రతీ ఒక్కరినీ మళ్ళీ ఎంతగానో కలచివేసింది. దీనితో ఎందరో సినీ తారలు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తూ ప్రతి ఒక్కరిని చెయ్యమని కోరుకుంటున్నారు.

అలా ఇపుడు తాజాగా మంచు లక్ష్మి సంచలన ట్వీట్ పెట్టారు. మేము మీకోసం చేసింది ఇంకా పూర్తి కాలేదు, మీరు కూడా మాతోనే ఉన్నారు. దయచేసి కష్టకాలంతో పోరాడండి అని గట్టిగా కోరుకున్నారు. అలాగే భగవంతుగా నువ్వున్నావని నిరూపించాల్సిన సమయం వచ్చింది దయచేసి నిరూపించు అని అర్థిస్తూ బాలు గారి ఆరోగ్యంపై భావోద్వేగపూరిత ట్వీట్ పెట్టారు. మన అందరం కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :

More