మళ్ళీ బుల్లితెరపై మంచు లక్ష్మి

మళ్ళీ బుల్లితెరపై మంచు లక్ష్మి

Published on May 6, 2015 4:49 PM IST

manchu-lakshmi
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి.. నటిగా, నిర్మాతగా, టీవీ వ్యాఖ్యాతగా, సింగర్‌గా ఇలా ప్రతీ విషయంలోనూ తన విలక్షణతను చాటుకుంటూ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట్లో ఆమె టీవీ వ్యాఖ్యాతగా చేసిన ‘లక్ష్మీ టాక్ షో’, ‘ప్రేమతో మీ లక్ష్మి’ వంటి షోలు ఆ సమయానికి ట్రెండ్ సెట్టింగ్‌గా నిలిచాయి. పెద్ద పెద్ద స్టార్లను తన మార్క్ స్టైల్లో ఇంటర్వ్యూ చేసి ఆకట్టుకున్నారు మంచు లక్ష్మి.

అయితే గత కొన్నాళ్ళుగా తన పూర్తి శ్రద్ధను సినిమాలపైనే పెట్టిన లక్ష్మి, తాజాగా మళ్ళీ బుల్లితెరపై దర్శనమివ్వనున్నారు. ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ పేరుతో లక్ష్మి ఓ టీవీ షోను ప్లాన్ చేశారు. జీ టీవీ ఆధ్వర్యంలో రూపొందే ఈ షో కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసేశారట. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుందని తెలుస్తోంది. మంచు లక్ష్మి తాజాగా నటించి, నిర్మించిన సినిమా ‘దొంగాట’ ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో పాటు మిగతా కమిట్‌మెంట్స్ పూర్తవ్వగానే లక్ష్మి కొత్త షో కోసం రెడీ అయిపోతారని తెలుస్తోంది.

తాజా వార్తలు