టాప్ తారలతో లక్ష్మీ మంచు స్పైసీ షో..,కొంచెం ఘాటుగా.

Published on Sep 18, 2019 7:06 pm IST

మంచు వారి అమ్మాయి లక్ష్మీ మంచు నిర్మాతగా, నటిగా, టీవీ హోస్ట్ గా అందరికి సుపరిచితురాలు. అమెరికన్ యాక్సెంట్ తో ఆమె మాట్లాడే తెలుగుకి చాలా మంది అభిమానులే ఉన్నారు. గతంలో అమెరికాలో కొన్ని షోస్ నిర్వహించిన లక్ష్మీ తెలుగులో మొదటిసారిగా లక్ష్మీ టాక్ షో తో కనిపించారు. ఆ తరువాత లక్కుంటే లక్ష్మీ, వంటి షోలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె మేము సైతం, మహారాణి వంటి షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఆమె డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అయిన వూట్ సంస్థ కొరకు ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ పేరుతో ఓ రియాలిటీ షో నిర్వహించనున్నారు. స్టార్స్ తో నిర్వహించే ఈ షో కొంచెం స్పైసీ గా సాగుతుందని ఆ షో ప్రోమో చుస్తే అర్థం అవుతుంది. టాప్ హీరోయిన్స్ అయిన కాజల్, సమంత, రకుల్, అలాగే హీరో వరుణ్ తో కూడిన ప్రోమోలో లక్ష్మీ అలరించారు. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కావడంతో సెన్సార్ సమస్యలు కూడా ఉండవు. కాబట్టి తారల ప్రైవేట్ విషయాలు కూడా పబ్లిక్ పంచుకుంటారట. ఈనెల 23నుండి ప్రసారం కానున్న ఈ షో తిలకించాలంటే వూట్ అప్లికేషన్ మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలి.

సంబంధిత సమాచారం :

X
More