‘పిలవని పేరంటం’తో వస్తున్న మంచు లక్ష్మి

‘పిలవని పేరంటం’తో వస్తున్న మంచు లక్ష్మి

Published on Nov 18, 2014 11:36 AM IST

Pilavani-Perantam-movie-ope
‘చందమామ కథలు’ తర్వాత మంచు లక్ష్మి నటించబోయే చిత్రానికి ‘పిలవని పేరంటం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘జగన్ నిర్దోషి’ ఫేం వెంకన్న బాబు దర్శకుడు. ఫిమేల్ ఓరియెంటెడ్ హారర్ కామెడీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. హాస్య నటుడు ధనరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రం పూజ కార్యక్రమాలు నేడు జరిగాయి. కె.రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మంచు మనోజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. కథ అంతా మంచు లక్ష్మి పాత్ర చుట్టూ తిరుగుతుంది. థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. సన్నివేశాలు ఉత్కంఠతకు గురి చేస్తాయి. అని దర్శకుడు వెంకన్న బాబు తెలిపారు.

విజయ్ కురాకుల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జెయల్ బాబు సినిమాటోగ్రాఫర్. ప్రియదర్శిని మూవీస్ మరియు జైన్ మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాలి సుబ్బారావు నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు