ఆయన అంటే ఎంతో గౌరవం – మంచు మనోజ్

Published on Aug 8, 2018 9:19 am IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ దిగ్గజం, కరుణానిధి అనారోగ్యం కారణంగా ఆయన కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. కరుణానిధి మరణవార్త తెలియగానే డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విషాదంలో ముగినిపోయారు. తమ అభిమాన నాయకుడు ఇక లేరన్న వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

‘‘తమిళ సినీ పరిశ్రమలో సినీ రచయిత మొదలై ఐదు సార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రి గా గెలిచిన ఘనత మరియు చరిత్ర కరుణానిధిగారిది. డీఎంకే పార్టి అధ్యక్షుడిగా ఏభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న గొప్ప నాయకుడు ఆయన. తమిళ ప్రజలకు తమిళనాడుకు ఆయన చేసిన సేవలు మరియు తమిళ సాహిత్యానికి ఆయన అందించిన ప్రోత్సాహం తోడ్పాటు మరువలేనివి, మాటల్లో చెప్పలేనివి. అందుకే ఆయనంటే ఎంతో గౌరవం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని యంగ్ హీరో మంచు మనోజ్ ట్విట్ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More