అదిరిపోయే సెలబ్రిటీ గేమ్ షో తో ఆడియన్స్ ముందుకి మంచు మనోజ్

అదిరిపోయే సెలబ్రిటీ గేమ్ షో తో ఆడియన్స్ ముందుకి మంచు మనోజ్

Published on Nov 29, 2023 11:20 PM IST


యువ నటుడు మంచు మనోజ్ కెరీర్ పరంగా ఇటీవల అహం బ్రహ్మాస్మి మూవీ ప్రారంభించారు. అయితే కొన్ని కారణాల వలన ప్రక్కన పెట్టిన ఈ ప్రాజక్ట్ అతి త్వరలో పునః ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక కెరీర్ పరంగా ఇప్పటికే పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి ఆడియన్స్ మనసు దోచిన మంచు మనోజ్ అతి త్వరలో ప్రముఖ ఓటిటి మాధ్యమం ఈటివి విన్ ద్వారా ఉస్తాద్ అనే సెలబ్రిటీ గేమ్ షో ద్వారా ఆడియన్స్ ముందుకి రానున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందనున్న ఈ గేమ్ షో కి రాంప్ ఆడిద్దాం అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ షో లో పలువురు సెలెబ్రిటీలు సందడి చేయడం, అలానే పలు సరదా గేమ్స్ లో పాల్గొని సందడి చేయడం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారట మేకర్స్. అతి త్వరలో ఈ క్రేజీ షో ఈటివి విన్ ఆడియన్స్ ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు