తన పెళ్లి రూమర్స్ పై మంచు మనోజ్ ఫన్నీ రియాక్షన్.!

Published on Mar 7, 2021 5:52 pm IST

మంచు వారి హీరో మంచు మనోజ్ హీరోగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసాడు. తనదైన కామెడీ మరియు యాక్షన్ సినిమాలతో మాంచి ఎంటర్టైన్మెంట్ ను ఇవ్వడమే కాకుండా కష్టమన్న వారికి లేదనకుండా సాయం కూడా చేసేవాడు. అయితే తన కెరీర్ లో కొన్నాళ్ళు ఎక్కువ బ్రేక్ నే తీసుకున్న మనోజ్ మరి ఈ గ్యాప్ లోనే తన పర్సనల్ లైఫ్ లో చాలానే చేంజెస్ ను చూసాడు.. అన్ని అయ్యిపోయి మళ్ళీ తన సినీ కెరీర్ ను కూడా మనోజ్ బిగిన్ చేసి అందులో బిజీగా ఉన్నాడు.

సరే ఇదంతా బాగుంది అనేలోపల తన మలి వివాహంపై అనేక రూమర్స్ ఈ రెండు రోజుల్లో మొదలయ్యాయి. దీనిపై ఫన్నీ రియాక్షన్ నే మనోజ్ ఇవ్వడం వైరల్ గా మారింది. తనకి తెలియకుండానే ఫిక్స్ అయ్యిన పెళ్ళికి లేటెస్ట్ “జాతి రత్నాలు”లోని బ్రహ్మానందం గారి వీడియో టెంప్లేట్ తో ఆ డేట్ టైం కూడా ఫిక్స్ చేసెయ్యండి అని రిప్లై ఇవ్వడం నెటిజన్స్ కు ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చింది. దీనితో ఈ రూమర్స్ పై మంచు మనోజ్ ఇలా చెక్ పెట్టేసాడు.

సంబంధిత సమాచారం :