సన్నీ లియోన్ తో ఎంజాయ్ చేస్తున్న మంచు మనోజ్

సన్నీ లియోన్ తో ఎంజాయ్ చేస్తున్న మంచు మనోజ్

Published on Jun 28, 2014 12:38 PM IST

manchu-manoj-sunny-leone
బాలీవుడ్ లో అలజడి రేపిన హాట్ హీరోయిన్ సన్నీ లియోన్ మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ లో చిత్రం లో టీచర్ గా నటించనుంది. ఈ చిత్రం లో పాత్రానుసారంగా చీరలలో కనిపించనుంది.

సన్నీఇటివలే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటుంది. హీరో మంచు మనోజ్ సన్నీ తో షూటింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. సన్నీ గురించిన కొన్ని మంచి విషయాలు మనోజ్ తన మైక్రోబ్లాగ్గింగ్ పేజి లో పోస్ట్ చేసాడు. “లవ్లీ డాల్ సన్నీ నేను పని చేసిన వారందరి లో మంచిది. ఆమెతో కలసిపనిచేయడం చాలా ఆనందంగా వుంది. ‘కరెంట్ తీగ’ షూటింగ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాం”. అని మనోజ్ తెలిపాడు.

రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సన్నీ ‘కుల్ఫీ’ చిత్రం లోని ఒక ప్రత్యేక పాటకు నర్తించనుంది. దీనితో పాటు ఎం టి వి స్పిల్ట్స్ విల్లా లో స్పెషల్ ఎపియరేన్స్ ఇవ్వనుంది.

తాజా వార్తలు