ఇటీవలే జరిగిన ఓ విషాదకర సంఘటన సమయంలో యంగ్ హీరో మంచు మనోజ్ స్పందించిన విధానం ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య మంచు మనోజ్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులు పెట్టిన ట్వీట్ లకు రీట్వీట్ లు పెడుతూ వారి మనసును గెలుచుకుంటున్నాడు. అయితే కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నా.. చాలా స్ఫోటివ్ గా తీసుకుని, ఏమాత్రం విసుగు లేకుండా.. సరదాగా సమాధానమిస్తూ అందర్నీ నవ్విస్తున్నాడు.
కాగా తాజాగా మనోజ్ అభిమాని ట్వీట్ చేస్తూ.. ‘‘మనోజ్ అన్న నైట్ మీరు నా కలలోకి వచ్చారు. మీరు బురద పొలంలో ఆడుకుంటూ అచ్చం పసి పిల్లాడిలా ఆనందపడ్డారట’’ అని పోస్ట్ చేయగా.. మనోజ్ ఆ ట్వీట్ కి రీట్వీట్ చేస్తూ.. ‘‘ఆహా.. వినడానికే వినసొంపుగా ఉంది. థాంక్స్ ఫర్ ది ఐడియా. ఈ సారి నేను మా ఊరిలో స్వయంగా పొలం పండిస్తా. చాలా సంవత్సరాలు అయింది.. దుక్కి దున్ని. థాంక్యూ తమ్ముడు లవ్యూ’ అని పోస్ట్ చేశాడు.
Aaaahhaaa vinadanike Vinasompu ga vundhi 🙂 ❤️❤️❤️❤️ Thanks for the idea 🙂 Esari ma vurrilo nenu swayamuga pollam pandistha 🙂 chaaaala years ayindhi Dhuki Dhuni ????Love u thammudu and Good morning to all the sweet people out there ❤️❤️❤️❤️??????? https://t.co/i69Gb8dnxs
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) September 6, 2018


