నందమూరి అభిమానుల మనసును గెలుచుకున్న ప్రముఖ హీరో !

Published on Sep 1, 2018 12:54 pm IST

ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణగారు తన హఠాన్మరణంతో సినీ రాజకీయ రంగాలకు తీరని లోటు మిగిల్చారు. అయితే తండ్రిని పోగొట్టుకున్న కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాధలో ఉన్న ఎన్టీఆర్ ని అలా చూసే సరికి అభిమానులు తట్టుకోలేకపోయారు. దాంతో హరికృష్ణ అంత్యక్రియల జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ ని ఓదార్చే అందుకు అభిమానులు ఒక్కసారికి ఎన్టీఆర్ వైపు దూసుకొచ్చారు. చుట్టూ ఉన్న రాజకీయ సినీ ప్రముఖులను తోసుకుంటూ అభిమానులు ఎన్టీఆర్ వైపు వస్తున్నా, ఎవరూ అడ్డుకోలేక అందరూ అలా చూస్తూ ఉండిపోయారు.

ఆ సమయంలో ఎన్టీఆర్ మీద ఎవరు పడకుండా ఓ హీరో బౌన్సర్‌లా నిలిచాడు. ఆ హీరో మరెవరో కాదు, ఎన్టీఆర్ ఆప్తమిత్రుడు మంచు మనోజ్. ఎన్టీఆర్‌ కి చిన్నప్పటి నుండి మనోజ్ మంచి ఫ్రెండ్. ఆ కారణంగా అభిమానులను చివరివరకు కంట్రోల్ చేస్తూ ఎన్టీఆర్ కి అండగా నిలబడ్డాడు. దాంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా ద్వారా మంచు మనోజ్ ను అభినందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :