చెన్నైలో ప్రజలకు తాగునీరు అందిస్తోన్న తెలుగు హీరో !

Published on Jun 25, 2019 3:36 pm IST

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యువ హీరోల్లో మంచు మనోజ్ ముందు వరుసలో ఉంటారు. పైగా సామాజిక అంశాల పై ఆయన ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే తాజాగా మనోజ్ మరో మంచి సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నై న‌గ‌రంలో ప్ర‌జ‌లు తాగునీరు కోసం బాగా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే గతంలో హుద్ హుద్, చెన్నై వ‌ర‌ద‌ల వచ్చినప్పుడు తెలుగు ప్ర‌జ‌లు ఎలా అయితే సాయం అందిచారో ఇప్పుడు తాగునీరు కోసం ఇబ్బంది పడుతున్న చైన్నై ప్రజలకు కూడా సాయం అందించాలని కోరారు.

ఈ సందర్భంగా మనోజ్ విజ్ఞప్తి చేస్తూ.. మ‌న వంతు వ‌చ్చింది. మ‌న దేశంలోనే 6వ మ‌హాన‌గ‌రం అయిన చెన్నై నీరు లేకుండా ఇబ్బంది ప‌డుతోంది. నా ఫ్రెండ్స్ మరియు కొంతమంది శ్రేయోభిలాషుల సాయంతో చెన్నైలో నేను పెరిగిన కొన్ని ఏరియాల్లో ప్రజలకు తాగునీరుని అందిస్తున్నాను. మీరు కూడా మీ వంతుగా సాయం చేయాల‌ని కోరుతున్నానని మంచు మనోజ్‌ అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More