“రాధే శ్యామ్” టీమ్ కి మంచు విష్ణు బెస్ట్ విషెస్

Published on Mar 11, 2022 11:00 am IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం థియేటర్ల లోకి వచ్చేసింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. అయితే ఈ చిత్రం విడుదల సందర్భంగా మా ప్రెసిడెంట్, నటుడు మంచు విష్ణు బెస్ట్ విషెస్ తెలిపారు.

నా సోదరుడు ప్రభాస్ కు, రాధా కృష్ణ కుమార్ కి, పూజా హెగ్డే మరియు చిత్ర యూనిట్ కి ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. మంచు విష్ణు చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజికల్ సెన్సేషన్ థమన్ అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం :