మంచు విష్ణు ‘డైనమైట్’ షూట్ @ నైట్

మంచు విష్ణు ‘డైనమైట్’ షూట్ @ నైట్

Published on Mar 11, 2015 3:55 PM IST

vishnu
మంచు విష్ణు హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డైనమైట్’. బెంగుళూరు బ్యూటీ ప్రణిత ఈ సినిమాలో హీరోయిన్. ఫిబ్రవరిలో మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నేటి నుండి నైట్ షెడ్యూల్ ప్రారంభమైంది. హీరో విష్ణు, ప్రణిత, తమిళ హాస్య నటి విద్యు రామన్ షూటింగులో పాల్గొంటున్నారు. రాత్రి నేపధ్యంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మంచు మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు స్వయంగా ‘డైనమైట్’ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మంచు విష్ణు, తన ఎడమ చేతిపై ఓ భారి టాటూ (పచ్చబొట్టు) వేయించుకున్నారు. క్యారెక్టర్లో ఇంటెన్సిటీని ఆ టాటూ బాగా ఎలివేట్ చేస్తుందని దర్శకుడు కన్వీన్స్ చేయడంతో విష్ణు సరే అన్నారు. తమిళంలో ఘన విజయం సాదించిన ‘ఆరిమ నంబి’ సినిమాకు రీమేక్ ఈ ‘డైనమైట్’.

తాజా వార్తలు