పీవీ సింధు హోటల్ బిల్ రహస్యంగా చెల్లించిన హీరో.

Published on Jun 26, 2019 6:01 pm IST

భారత్ బాడ్మింటన్ సంచలనం పీవీ సింధు హోటల్ బిల్ ని ఓ హీరో ఆమెకు తెలియకుండా చెల్లించి సర్ప్రైస్ చేశారు. పీవీ సింధు మరో మహిళ యూ ఎస్ కౌన్సిల్ జనరల్ క్యాథరిన్ హడ్డా తో కలిసి ఓ ప్రముఖ హోటల్ లో లంచ్ చేయగా ఆసమయంలో అక్కడే ఉన్న మంచు విష్ణు వారి బిల్ చెల్లించి వారిని సర్ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా పీవీ సింధు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. మంచు విష్ణుని కలవడం ఎంతో ఆనందంగా ఉంది, మా బిల్ చెల్లించినందుకు మీకు కృతఙ్ఞతలు అని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

దీనికి సమాధానంగా మంచు విష్ణు మీలాంటి లవ్లీ లేడీస్ లంచ్ బిల్ చెల్లించడం మా అదృష్టంగా భావిస్తున్నాం, ఐనా ఆడవారి చేత బిల్ కట్టించడం పురుష లక్షణం కాదు, సింధు నువ్వు చాలా పొడగరి అని ట్వీట్ చేశారు. పీవీ సింధు బయోపిక్ త్వరలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే, ఈ మూవీని ప్రముఖ విలన్ సోనూసూద్ నిర్మిస్తుండగా,దీపికా సింధు పాత్ర చేసే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More