బెంగాలీ భామతో మంచు విష్ణు రొమాన్స్..!

బెంగాలీ భామతో మంచు విష్ణు రొమాన్స్..!

Published on Dec 17, 2014 6:52 PM IST

vishnu
మంచు విష్ణు హీరోగా విమర్శకుల ప్రసంశలు అందుకున్న దర్శకుడు దేవా కట్ట తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా బెంగాలీ ముద్దుగుమ్మ త్రిధా చౌదరిని ఎంపిక చేశారని సమాచారం. మొదట ఈ పాత్రకు అదా శర్మను పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. చివరకు త్రిధా చౌదరి వైపు దర్శక నిర్మాతలు మొగ్గు చూపారని సమాచారం. అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. నిఖిల్ ‘సూర్య vs సూర్య’ సినిమాలో కూడా ఈ అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో తొలి సినిమా విడుదలకు ముందే మరో అవకాశం సొంతం చేసుకుని పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది త్రిధా చౌదరి.

విక్రమ్ ప్రభు హీరోగా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’కి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. మంచు మోహన్‌బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు