
‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ లాంటి విమర్శనాత్మక సినిమాలు చేసిన డైరెక్టర్ దేవా కట్ట మొదటి సారి చేస్తున్న రేమీక్ మూవీ ‘డైనమైట్’. సినిమా సినిమాకి పొంతన లేకుండా సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్న యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమాలో ప్రణిత హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం కల్లా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో పాటలని గత కొద్ది రోజులుగా షూట్ చేస్తున్నారు.
ఈ సినిమాలోని చివరి పాట కోసం నానక్రాం గూడాలోని రామానాయుడు స్టూడియోస్ లో ఓ స్పెషల్ సెట్ ని వేసారు. గత నాలుగు రోజులుగా ఫైనల్ సాంగ్ షూట్ ని ఈ సెట్లో షూట్ చేస్తున్నారు. మంచు విష్ణు – ప్రణితలపై షూట్ చేస్తున్న ఈ సాంగ్ కి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ రోజుతో ఈ పాట షూటింగ్ పూర్తవుతుంది. దాంతో డైనమైట్ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ సీన్స్ ని మరో రెండు మూడు రోజుల్లో ఫినిష్ చేస్తారు.
ఇటీవలే విడుదలైన డైనమైట్ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’కి రీమేక్. మంచు మోహన్‌బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

