మంచు వారబ్బాయి మంచు విష్ణు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ లో వేలంపాట (ఆక్షన్ సిస్టం) ద్వారా ఓ కొత్త విధానాన్ని మొదలు పెట్టాడు. ఇదొక కొత్తరకమైన ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. ఈ విధానం ద్వారా ఈ సినిమా కొనుక్కోవడం కోసం కొంతమంది కొత్త వాళ్ళు ముందుకు వస్తారు.
ఈ విధానాన్ని filmauction.in ద్వారా మంచు విష్ణు లాంచ్ చేసాడు. కానీ ఈ వర్క్ కి ఇండస్ట్రీ నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోంది. ఇండస్ట్రీలోని చాలా మంది చిన్న చిన్న నిర్మాతలు, మీడియం నిర్మాతలు అతను తీసుకున్న స్టెప్ కి పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు.
ఈ విధానాన్ని త్వరలో రానున్న మంచు విష్ణు – రామ్ గోపాల్ వర్మల ‘అనుక్షణం’ సినిమా కోసం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. మరి ఈ కొత్త డిస్ట్రిబ్యూషన్ విధానం ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.


