​‘మండాడి’ నుంచి సుహాస్ మేకింగ్ వీడియో విడుదల

​‘మండాడి’ నుంచి సుహాస్ మేకింగ్ వీడియో విడుదల

Published on Jun 28, 2026 8:00 AM IST

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి సుహాస్ మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

​తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సుహాస్ ‘సాట్టపులి’ అనే పాత్రలో డీ గ్లామరస్ లుక్‌లో కనిపించనున్నారు. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో యాక్షన్, బోట్ సీక్వెన్స్‌లు ప్రధానంగా ఉంటాయని మేకర్స్ తెలిపారు. సహజమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమాలో సూరి, సుహాస్ మధ్య వచ్చే సన్నివేశాలు కీలకంగా ఉండనున్నాయి.

​ఇందులో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, బాల శరవణన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘మండాడి’ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు