‘మాంగల్యం’ నటుడిపై విమర్శలు.. డిజప్పాయింట్ అయ్యిన ఫాలోవర్స్?

‘మాంగల్యం’ నటుడిపై విమర్శలు.. డిజప్పాయింట్ అయ్యిన ఫాలోవర్స్?

Published on Jun 9, 2026 3:08 PM IST

చేసిన కంటెంట్ చిన్నదైనా పెద్దదైన కూడా అది చూపించే ఇంపాక్ట్ మాత్రం కొందరిని డెఫినెట్ గా లైమ్ లైట్ లోకి తీసుకొస్తుంది. అలా తన ఏ రేటెడ్ సినిమా మాంగల్యం తో పబ్లిక్ స్టార్ గా తనకంటూ ఒక సెపరేట్ మార్క్ ని తెలుగు యువతలో సాధించిన టాలెంటెడ్ నటుడు బండి సరోజ్.

తన రీసెంట్ చిత్రం ‘మోగ్లీ’ లో కూడా సాలిడ్ నెగిటివ్ రోల్ చేసి ఒక యాంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇన్ని రోజులో తనలో ఏ స్వభావాన్ని చూసి ఫాలో అయ్యిన వారు ఉన్నారో వారిని తాను డిజప్పాయింట్ చేసాడని చెప్పక తప్పదు. ఎవరినఎవరో క్రిటిక్ ని దృష్టిలో పెట్టుకొని తాను రెండేళ్లుగా కథ సిద్ధం చేసుకోవడం ఏంటని విమర్శలు చేస్తున్నారు.

ఈ తరహా టర్న్ తన నుంచి రావడం మాత్రం తన యాటిట్యూడ్ ని ఇష్టపడి అభిమానించేవారిని డిజప్పాయింట్ అయ్యేలా చేసింది. దీనితో సోషల్ మీడియాలో మాత్రం తన ఫాలోవర్స్ నుంచి మిశ్రమ స్పందన తనకి తప్పలేదు.

తాజా వార్తలు