
విలక్షణ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఒకే బంగారంతో ఆయన ఎన్నాళ్ళగానో కోల్పోయిన ఫామ్ ని తిరిగి సంపాదించుకున్నట్టు తెలుస్తుంది. తప్పుపట్టలేని కధనాన్ని మన మణి అద్భుతమైన తారాగణం సహాయంతో ఈజీగా సొంతంచేసుకున్నాడు. రెహమాన్ సంగీతం, దుల్కర్ సల్మాన్, నిత్యా మెనన్ నటన ఆకట్టుకుంది.
మొదటి వారం నుండి ఈ సినిమా మల్టీప్లెక్స్ ప్రేక్షకులను మెప్పిస్తూవస్తుంది. పంపిణీదారులకు సైతం లాభాలను తెచ్చిపెడుతున్న ఈ సినిమా ఓవర్ సీస్ లో సైతం మంచి కలెక్షన్ లను సాధిస్తుంది. లెక్కల ప్రకారం ఇప్పటికే హిట్ అయిన ఈ సినిమాను దిల్ రాజు తెలుగు రైట్స్ సొంతంచేసుకున్నాడు.

