భారతదేశంలో వున్న టాప్ డైరెక్టర్ లలో మణిరత్నం ఒకరు. తన తాజా సినిమా ‘ఒకే బంగారం’ నిన్నే ఆడియో విడుదలై త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతుంది. రెహమాన్ ఈ సినిమాకు స్వరాలను అందించాడు.
మణిరత్నం ఈ సందర్భంగా మాట్లాడుతూ రెహమాన్ అద్భుతమైన స్వరాలను సమకూర్చినట్టు తెలిపాడు. అంతేకాక తెలుగు వెర్షన్ కి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించనట్టు తెలిపాడు. ఆయనతో కలిసి పనిచేయడం ఇదే తొలిసారికావడం విశేషం. ఈ సినిమా ఆడియో ఇప్పటికే ఇన్స్టంట్ హిట్ గా నిలిచాయి.


