‘ఓకే బంగారం’తో మణిరత్నం బ్యాక్ టు ఫామ్.!

‘ఓకే బంగారం’తో మణిరత్నం బ్యాక్ టు ఫామ్.!

Published on Mar 1, 2015 5:36 PM IST

mani-ratnam
సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన మణిరత్నం వరుసగా ఆయన మార్క్ సినిమాలు తీస్తున్నా బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అందుకొని మాత్రం చాలా కాలం అయ్యింది. కానీ ఈ సారి మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అందుకుంటాడని, మళ్ళీ ఫుల్ ఫాంలోకి వస్తాడని అంటున్నారు. దానికి కారణం ఈ రోజు రిలీజ్ చేసిన ట్రైలర్. ఈ రోజు మణిరత్నం లేటెస్ట్ మూవీ ‘ఓకే కన్మణి’ ఫస్ట్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కి అందరి నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని ‘ఓకే బంగారం’ అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేయనున్నాడు. మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడు, ప్రెజెంట్ మలయాళంలో ట్రెండ్ సెట్ చేస్తున్న యంగ్ హీరో దల్క్వేర్ సల్మాన్, కేరళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటించారు. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని ఏప్రిల్ 14న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేసింది. తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

మణిరత్నం కెరీర్లో అత్యంత వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాగా ‘ఓకే బంగారం’ రికార్డులకు ఎక్కింది. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.

ఓకే బంగారం తమిళ్ వెర్షన్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు