సౌత్ ఇండియన్ మోస్ట్ ఫేమస్ అండ్ టాప్ డైరెక్టర్స్ లో మణిరత్నం ఒకరు.. హీరో హీరోయిన్లతో పాటు ఆయనతో పనిచేయాలని ప్రతి ఒక్క టెక్నీషియన్ అనుకుంటూ ఉంటాడు. మణిరత్నం చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్స్ అయినా అన్ని సినిమాలు మ్యూజికల్ గా మాత్రం సక్సెస్ అవుతాయి. మణిరత్నం మాస్ట్రో ఇళయరాజాతో కలిసి చేసినప్పుడు తెలుగు రచయిత రాజశ్రీతో కలిసి పనిచేసాడు. వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘మౌనరాగం’, ‘నాయకుడు’, ‘దలపతి’ మొదలైన సినిమాలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. ఆ తర్వాత ఎఆర్ రెహమాన్ తో కలిసి పనిచేసే సమయంలో వేటూరి గారితో కలిసి పనిచేసాడు. వీరి కాంబినేషన్ లో బొంబాయి, సఖి, అమృత సినిమాలు కూడా మ్యూజికల్ హిట్స్ అయ్యాయి.
వీరి తర్వాత మణిరత్నం లేలుగు లెజండ్రీ లిరిసిస్ట్ అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రితో కలిసి పనిచేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో చాలా రోజుల క్రితం ప్రేమతో సినిమా వచ్చింది. అది షారుఖ్ ఖాన్ దిల్ సే సినిమాకి డబ్బింగ్ వెర్షన్. ఇన్ని రోజుల తర్వాత మణిరత్నం సీతారామశాస్త్రి కలిసి ‘ఓకే బంగారం’ సినిమాకి పని చేస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రానున్న ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. తెలుగులో దిల్ రాజు ఈ సినిమాని అందిస్తున్నారు.


