‘ఒకే బంగారం’ అంటున్న మణిరత్నం

‘ఒకే బంగారం’ అంటున్న మణిరత్నం

Published on Jan 10, 2015 3:30 AM IST

Mani-Ratnam
తనకు మాత్రమే సొంతమైన మార్కుతో సినిమాను తీసే దర్శకులలో మణిరత్నం ఒకరు. లేట్ గా సినిమాలు తీస్తాడన్న అపవాదును బయటపడుతూ తన తాజా చిత్రం ‘ఒకే కన్మణి’ సినిమాను రికార్డు సమయంలో తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘ఒకే బంగారం’ ప్రస్తుతం నిర్మాణాంతర పనులలో బిజీగా వుంది

మణిరత్నం గత రెండు చిత్రాలు తీవ్ర నిరాశకు గురిచేసిన తరుణంలో క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మణి ఫేవరేట్ టెక్నీషియన్స్ అయిన సినిమాటోగ్రాఫర్ పీ.సి శ్రీరాం, మ్యూజిక్ మేజీషియన్ రెహమాన్ ఈ సినిమాకు 2000 సంవత్సరంలో విడుదలైన సఖి సినిమా తరువాత తిరిగి పనిచేస్తున్నారు

తాజా సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ పంపిణీ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు

తాజా వార్తలు