అంచనాలు పెంచుతున్న మణికర్ణిక !

Published on Oct 2, 2018 10:37 am IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మణికర్ణిక’. పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్.. చిత్రం పై ఒక్కసారిగా అంచనాలను పెంచుతుంది. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ తో మణికర్ణిక టీజర్ మొదలవుతుంది. టీజర్ లో ప్రధానంగా కంగనా రనౌత్ హైలెట్ అవ్వగా.. శంకర్-ఎహ్సాన్-లాయ్ అందించిన నేపధ్య సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

కాగా ఇటీవలే ఈ చిత్రం దర్శకత్వం పై వస్తోన్న అనేక రూమర్లకు చిత్ర నిర్మాతలు చెక్ పెట్టారు. మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కించింది క్రిషే అని.. కాబట్టి ఈ సినిమాకు ఆయనే డైరెక్టర్ అని నిర్మాతలు స్పష్టం చేశారు. జీ స్టూడియోస్ మరియు కమల్ జైన్ సంయుక్తంగా నిశాంత్ పిట్టీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 25 న మణికర్ణిక ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :