గతంలో ‘క్రిమినల్’, ‘బొంబాయి’, ‘బాబా’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ మనీషా కొయిరాల. ఇటీవలే తను కాన్సర్ కి గురైంది, దాని కోసం చాలా రోజులు ట్రీట్ మెంట్ తీసుకొని పూర్తిగా కోలుకున్నాక మనీషా కొయిరాల మళ్ళీ పబ్లిక్ లోకి వస్తోంది. ఈ 44 సంవత్సరాల హీరోయిన్ తాజాగా ఓ బేబీ గర్ల్ ని దత్తత తీసుకుంది.
ఈ విషయం గురించి మనీషా కొయిరాల మాట్లాడుతూ ‘చాలా రోజుల నుంచి దత్తత తీసుకోవాలనే ఆలోచన ఉంది. కానీ నా ఆరోగ్య సమస్య వల్ల ఇన్ని రోజులూ వెనకడుగు వేసాను. అలాగే మనీషాకి దత్తత తీసుకున్న బేబీ మరియు తన తల్లితో ఉన్న రిలేషన్ అంత బాగోలేదని’ తెలిపింది. మనీషా కొయిరాల ప్రస్తుతం ముంబై లో సెటిల్ అయ్యింది. అలాగే మళ్ళీ మూవీస్ లో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతోంది.


