‘ఇండియన్-2’ మూవీలో భారతీయుడు బ్యూటీ..?

‘ఇండియన్-2’ మూవీలో భారతీయుడు బ్యూటీ..?

Published on Jun 11, 2024 8:01 AM IST

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఇండియన్-2’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా గతంలో వచ్చిన ‘ఇండియన్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. గతంలో వచ్చిన ఇండియన్(తెలుగులో భారతీయుడు) మూవీలో అందాల భామ మనీషా కొయిరాల హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. రీసెంట్‌గా ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో ఆమె నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. అయితే, ఆమె తాజాగా ‘ఇండియన్-2’ మూవీలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఓ పోస్టర్‌లో ఈ విషయం వెల్లడైంది.

అయితే ‘ఇండియన్-2’ సినిమాలో మనీషా ఎలాంటి పాత్రలో కనిపిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో కమల్ సేనాపతిగా మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపెట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, జూలై 12న ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు