మన్మధుడు 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్.

Published on Aug 13, 2019 2:47 pm IST

నాగార్జున,రకుల్ ప్రీత్ జంటగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన మన్మధుడు 2 బాక్సాపీస్ వద్ద ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్ర వసూళ్లు ఆశాజనకంగా సాగడంలేదు. నాగార్జున ప్రెస్ మీట్ లో ఈ మూవీని ప్రేక్షకులు అంగీకరించడానికి కొంచెం సమయం పడుతుందని స్వయంగా చెప్పినప్పటికీ అటువంటి పరిణామాలేవి కనబడటం లేదు.

ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ జరుగగా ఇప్పటికి కేవలం 8.7కోట్ల వసూళ్లు మాత్రమే దక్కించుకుంది. అంటే అమ్మిన దాంట్లో ఇంకా 50 శాతం వసూళ్లు కూడా ఇంకా రికవరీ కాలేదని అర్థం అవుతుంది. ఇంకా రెండు రోజులలో ఎవరు,రణరంగం చిత్రాల విడుదల నేపథ్యంలో ‘మన్మధుడు2’, 20కోట్ల వసూళ్లకు చేరుకోవడం కష్టంతో కూడుకున్న వ్యవహారంలానే కనబడుతుంది.

సంబంధిత సమాచారం :