‘మన్మథుడు 2’ ఫుల్ రొమాన్స్ !

‘మన్మథుడు 2’ ఫుల్ రొమాన్స్ !

Published on Jul 4, 2019 7:50 PM IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ రచయితగా ఉన్నపుడు రాసిన అద్భుతమైన చిత్రాల్లో ‘మన్మథుడు’ ఒకటి. అక్కినేని నాగార్జున కెరీర్ లోనే ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. మరి అలాంటి మూవీకి సీక్వెల్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా ‘మన్మథుడు 2 ‘ రాబోతుంది. మరి మన్మథుడు స్థాయిను ఈ చిత్రం అందుకోగలదా.. త్రివిక్రమ్ కామెడీ టైమింగ్ ముందు, రాహుల్ రవీంద్రన్ రాసిన స్క్రిప్ట్ నిలబడగలగదా.. ‘మన్మథుడు’లో త్రివిక్రమ్ కామెడీ ఏ స్థాయిలో పేలిందో.. ఈ సినిమాలో అంతకుమించి పేలాలి. అప్పుడే ఈ చిత్రం ఆడియన్స్ అంచనాలు అందుకోగలుగుతుంది.

అయితే మన్మథుడులో ఉన్నట్టే మన్మథుడు 2 లో కూడా నాగార్జున పాత్ర ఫుల్ ఎంటెర్టైనింగా ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో మన్మథుడులో కంటే రొమాంటిక్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. మొత్తానికి రాహుల్ రవీంద్రన్ కామెడీతో కంటే, రొమాన్స్ నే ఎక్కువుగా నమ్ముకున్నాడు అన్నమాట. ఎలాగూ కామెడీని ఎంతబాగా రాసిన, త్రివిక్రమ్ రేంజ్ లో పేలకపోవచ్చు.. అందుకే రొమాన్స్ సినిమాలో ప్రధానంగా ఉండేలా చూసుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగష్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు