మన్మధుడు 2 లేటెస్ట్ నైజాం కలెక్షన్స్

Published on Aug 17, 2019 1:13 am IST

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మన్మధుడు 2 మూవీ ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. వస్తున్న కలెక్షన్స్ రిపోర్ట్స్ అందుకు నిదర్శనం. ఇప్పటివరకు నైజాం ఏరియాలో ఈ చిత్రం కేవలం 2.5 కోట్ల షేర్ రాబట్టింది. నేటికి మూవీ విడుదలై దాదాపు 8రోజులు పూర్తయిన తరుణంలో ఈ వసూళ్లు చాలా తక్కువని చెప్పాలి. ఎందుకంటే మన్మధుడు 2 ఇంకా ఏమాత్రం బాక్సాఫీస్ వద్ద పుంజుకునే కనిపించడం లేదు. కారణం నిన్న మరో రెండు కొత్త చిత్రాలు విడుదల కావడం జరిగింది.

నాగార్జున, రకుల్ ప్రీత్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్ర రూపొందించారు. వెన్నెల కిషోర్, ఝాన్సీ, లక్ష్మి,రావు రమేష్ ఇతర కీలకపాత్రలలో నటించారు.

సంబంధిత సమాచారం :