‘మన్మథుడు 2’ మన్మథుడును మరిపిస్తాడట !

Published on Apr 17, 2019 7:43 pm IST

నాగ్ సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ గా ‘మన్మథుడు 2 ‘ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వస్తోన్న ఈ చిత్రం ‘మన్మథుడు’ను మరిపిస్తోందా ? ‘మన్మథుడు’లో త్రివిక్రమ్ కామెడీ ఎంత బాగా పేలిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

నాగ్ బెస్ట్ మూవీస్ లో ‘మన్మథుడు’ ముందువరుసలో ఉంటుంది. మరి అలాంటి మూవీకి సీక్వెల్ అంటే.. ఏ స్థాయిలో ఉండాలి. అయితే రాహుల్ రవీంద్రన్ రాసిన స్క్రిప్ట్ చాలా బాగుందని కామెడీ విషయంలో ‘మన్మథుడు’ను మన్మథుడు 2 మరిపిస్తాడని.. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది.

ఇక ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి. కిరణ్, సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్, స్క్రీన్ ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్.

సంబంధిత సమాచారం :